NEWS

అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆశ్చర్యపరుస్తోన్న ‘డీజే టిల్లు’

అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆశ్చర్యపరుస్తోన్న ‘డీజే టిల్లు’

Fri Feb 11 2022 23:00:01 GMT+0530 (IST)

DJ Tillu surprising in advance bookings

యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ – నేహాశెట్టి జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ”డీజే టిల్లు”. ‘అట్లుంటది మనతోని’ అనే ట్యాగ్ లైన్ తో కొత్త దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 12) థియేటర్లలోకి వస్తోంది.

ఇప్పటికే ”డీజే టిల్లు” సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. టీజర్ – ట్రైలర్ లోని రొమాంటిక్ సన్నివేశాలు – కిస్సింగ్ సీన్స్ – హీరోయిన్ నేహా అందాలు – పక్కా హైదరాబాదీ కుర్రాడిగా సిద్ధు నటన యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

అలానే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలోని అన్ని పాటలు కూడా శ్రోతలను అలరించాయి. ఇందులో ‘డీజే టిల్లు’ సినిమాపై ఏర్పడిన బజ్ కారణంగా.. అనుకున్న రేంజ్ కి మించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలలో 390 థియేటర్స్ లలో.. వరల్డ్ వైడ్ గా 640 వరకు స్క్రీన్స్ లో  ఈ సినిమా రిలీజ్ అవుతోంది. చిన్న సినిమాకి ఈ రేంజ్ థియేటర్స్ దొరకడానికి కారణం సితార బ్యానర్ అని చెప్పాలి.

ఇక అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందు నుండే ఓపెన్ అవ్వగా.. మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ బాగా జరుగుతుండగా.. మాస్ సెంటర్స్ లో డీసెంట్ గా ఉన్నాయి. ఇప్పటికే బుక్ మై షోలో రేపటికి హైదరాబాద్ మరియు వైజాగ్ వంటి పలు నగరాలలోని థియేటర్లలో బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. మరికొన్ని షోలు ఫాస్ట్ గా సోల్డ్ అవుతున్నాయి.

దీనిని బట్టి రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘డీజే టిల్లు’ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని అంచనా వేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ డే టాక్ బాగుండి యూత్ ఆడియన్స్ కి దగ్గరైతే మాత్రం.. వాలెంటైన్స్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు నమోదు చేసే అవకాశం ఉంది.

”డీజే టిల్లు” చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించి హీరో సిద్ధు జొన్నలగడ్డ మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు. శ్రీచరణ్ పాకాల – రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్సహకారంతో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఇందులో ప్రిన్స్ సిసిల్ – బ్రహ్మాజీ – ప్రగతి – నర్రా శ్రీనివాస్ – కిరీటి ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. లవ్ అండ్ ఫన్ అంశాలతో హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ”డీజే టిల్లు’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock