NEWS

జురాసిక్ వరల్డ్: ఒళ్లు ఝలదరించే ట్రీటుంది ముందు!

జురాసిక్ వరల్డ్: ఒళ్లు ఝలదరించే ట్రీటుంది ముందు!

Sat Feb 12 2022 22:23:12 GMT+0530 (IST)

Jurassic World Before the Years Treat

వేసవిలో ఒళ్లు ఝలదరించే ట్రీటుంది. ఊపిరి బిగబట్టి..  గుండె కొట్టుకుంటుందో లేదో చెక్ చేసుకుని మరీ ఈ సినిమా చూడాలి. అంతటి ఉత్కంఠ అడ్వెంచర్ ఇందులో ఉంది. సంచలనాల జురాసిక్ వరల్డ్ సిరీస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియెన్ కి అంత పిచ్చిగా నచ్చుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రీటిచ్చేందుకు ఈ ఫ్రాంఛైజీ నుంచి మరో సినిమా వస్తోంది. పిల్లలతో కలిసి పెద్దలు కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాధించాలంటే ఈ సినిమాని కొట్టేది లేదు. పాన్-వరల్డ్ ఫిల్మ్ సంచలనాలకు ఇంకెంతో దూరం లేదు. జూలైలో ఈ సినిమా విడుదల కానుంది.

వరుసగా హాలీవుడ్ సినిమాలు భారతదేశంలో అతి భారీ రిలీజ్ లతో సంచలనాలుగా మారుతున్నాయి. కోట్లాది రూపాయల మార్కెట్ ని కొల్లగొడుతున్నాయి. ఇంతకుముందు కరోనా క్రైసిస్ లోనూ స్పైడర్మ్యాన్: నో వే హోమ్ అద్భుతాలు సృష్టించింది. ఈ మూవీ   తర్వాత భారతీయ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కి సిద్ధమైన భారీ చిత్రం `జురాసిక్ వరల్డ్ డొమినియన్`. యూనివర్సల్ పిక్చర్స్ నుండి వస్తున్న డైనోసార్-నేపథ్య చలనచిత్రాల చివరి భాగం ఇది. దీనిని ఎపిక్ ముగింపు అని చెబుతున్నారు. భారీ తారాగణం  అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్  ట్రైలర్ ఆద్యంతం ట్రీట్ గా కనిపిస్తోంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ బ్లాక్ బస్టర్ కొడుతుందన్న కాన్ఫిడెన్స్ ని ట్రైలర్ ఇచ్చింది. ఈ చిత్రం జూన్ 10-11 తేదీలలో భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూన్ భారతీయ చిత్రాలకు అలాగే డైనోసార్ల సినిమాకు కేరాఫ్ గా మారింది. ఈ సీజన్ లో పరీక్షలు ముగించుకుని పిల్లలు పెద్దలతో కలిసి సినిమాలు వీక్షిస్తారు. అది కలెక్షన్లకు కలిసి రానుంది.

లాస్ ఏంజిల్స్ – వెనిస్ వంటి కొన్ని అందమైన నగరాల కనెక్టివిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నగరాల్లోకి డైనోసార్ లను తీసుకు రావడం అలాగే మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ట్రైలర్ ట్రీట్ అదిరింది. ఖచ్చితంగా ఈ చిత్రంపై అంచనాల్ని పెంచింది ట్రైలర్. జూన్ 2022 లో మన దేశంలో ఇతర పెద్ద సినిమాలేవీ లేవు. ఇప్పటికి జురాసిక్ వరల్డ్ డొమినియన్ కి పోటీ లేదు. మునుముందు ఇది మారుతుందేమో చూడాలి.

జురాసిక్ వరల్డ్ తర్వాత అవతార్ 2

అవతార్ మూవీ కోసం పండోరా గ్రహాన్ని సృష్టించి లెజెండరీ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. ఈ చిత్రాన్ని చూసిన జనం ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ చిత్రానికి వరుసగా సీక్వెల్స్ ని సిద్ధం చేస్తున్నారు జేమ్స్ కామెరూన్. ఆయన ఈసారి అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు.. అవతార్ ని ఓ రేంజ్ లో చూపించిన ఆయన సీక్వెల్స్ ని అండర్ వాటర్ లో ప్లాన్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు.  `అవతార్ 2` 2022 డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ క్రేజీ సీక్వెల్ కి సంబంధించిన దృశ్యాలని న్యూజిలాండ్ లోని అండర్ వాటర్ లో షూట్ చేస్తున్నారు. ఇటీవల కొన్నిఅండర్ వాటర్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. అండర్ వాటర్ లో చిత్రీకరించిన స్టంట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయనున్నాయట. ఇటీవల కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతుండటంతో చిత్ర బృందం షూటింగ్ ని నిరవధికంగా నిలిపి వేసింది. ఇటీవల తిరుగి షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో `అవతార్` సీక్వెల్స్ షూటింగ్ మళ్లీ సజావుగా సాగుతోంది.

అయితే ఈ సమయంలో ఈ చిత్రం కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన టీమ్ అ టెక్నాలజీతో నీటి అడుగుల సరికొత్త అవతార్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో చిత్రీకరణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. నీటి అడుగున షూటింగ్ చేస్తున్న సమయంలో నటీనటులు ఎలాంటి భయానికి లోనుకాకూడదని హవాయి తీరంలో శిక్షణ ఇచ్చారట. చూస్తుంటే ఆక్వామేన్ ని మించేలా.. జురాసిక్ వరల్డ్ సీక్వెల్ అండర్ వాటర్ ఎపిసోడ్స్ ని కొట్టేలా కామెరూన్ అవతార్ సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock