POLITICS

టీడీపీకేం తక్కువ… క్యాడర్ ఆత్మగౌరవ నినాదం…?

టీడీపీకేం తక్కువ… క్యాడర్ ఆత్మగౌరవ నినాదం…?

Sun Feb 13 2022 06:00:01 GMT+0530 (IST)

TDPK is low ... Cadre self-esteem slogan ...?

టీడీపీ దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీ. ఈ రోజుకీ కూడా క్షేత్ర స్థాయిలో క్రమశిక్షణ కలిగిన  క్యాడర్ ఉన్న పార్టీ. ఈ ఏడాది టీడీపీకి చాలా ప్రత్యేకం కూడా. నాలుగు దశాబ్దాలు ఈ మార్చి 29తో టీడీపీకి పూర్తి అవుతాయి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాంతీయ పార్టీలు దేశంలో వేళ్ల మీద లెక్క బెట్టే స్థాయిలో ఉన్నాయి. పైగా టీడీపీని పెట్టినది  మేరు నగధీరుడు అన్న నందమూరి తారకరామారావు. ఆయన ధైర్య సాహసాలకు మారు పేరు.

అలాంటి మహానుభావుడు పెట్టిన టీడీపీని పొత్తుల పార్టీ అని వైసీపీ తరచూ  విమర్శలు చేస్తూ ఉంటే తమ్ముళ్ళు అసలు తట్టుకోకేపోతున్నారుట. తమ కంటే అన్ని రకాలుగా తక్కువగా ఉన్న వైసీపీ టీడీపీని కామెంట్స్ చేయడమేంటి అని తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. టీడీపీకి ఏం తక్కువ అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఏపీ విభజన ఏపీని కలుపుకుని రెండు దశాబ్దాలకు పైగా పాలించిన టీడీపీ జనం గుండెల్లో ఉందని కూడా చెబుతున్నారు.

ఇక వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని దాన్ని జనంలో పెట్టి పార్టీ ముందుకు వెళ్తే పొత్తులతో ప్రమేయం లేకుండానే ఒంటరిగా వెళ్ళినా కూడా  బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక పొత్తుల పేరిట పార్టీలో ఉన్న వార్ని సుదీర్ఘ కాలం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వడం మంచిది కాదని కూడా కొందరు నేతలు సూచిస్తున్నారు.

అదే విధంగా టీడీపీతో పోలిసే పొత్తుల పేరిట స్నేహం చేయాలని చూస్తున్న ఇతర పార్టీలకు పెద్దగా బేస్ లేదన్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. పొత్తుల వల్ల వారిని తామే గెలిపించుకోవాలని కూడా అంటున్నారు.  దానికి బదులు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారు ఎవరో అధినాయకత్వం గుర్తించి వారిని ప్రోత్సహించాలని మంచి వారికి టికెట్లు ఇవ్వాలని సూచిస్తున్నారు.

గతంలో ఎన్టీయార్ టైమ్ లో పొత్తులతో కాకుండా టీడీపీ వెళ్లి గెలిచిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి టీడీపీ అధినాయకత్వం మీద పొత్తులు వద్దు అని తమ్ముళ్ళు వత్తిడి తెస్తున్నారు అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. పొత్తుల వల్ల లాభం పెద్దగా లేకపోగా  రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు అయితే పొత్తులతో గెలిచిన వారు కూడా వాటా కోరుతారని కీలక నిర్ణయాలలో వారు మద్దతు ఇవ్వకపోతే స్వేచ్చగా పనిచేసే అవకాశం కూడా ఉండదని పలువురు నాయకులు  అంటున్నారుట.

మరి ఇవన్నీ చంద్రబాబుకు తెలియవు అనుకోగలరా. ఆయన ఆలోచనలు ఏంటో. ఏది ఏమైనా ఎన్టీయార్ ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని పెట్టారు. అత్యంత పటిష్టమైన పార్టీగా తీర్చిదిద్దారు. అలాంటి పార్టీని నిన్నా మొన్న పుట్టిన పార్టీలు పొత్తుల పార్టీ అనీ  బలం లేదని అంటూంటే తమ్ముళ్ళు మాత్రం సహించలేకపోతున్నారు అన్నదే ఆసక్తికరమైన విషయం. చూడాలి మరి దీని మీద అధినాయకత్వం  ఎలాంటి అడుగులు వేస్తుందో.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock