NEWS

డీప్ కిస్ దేనికి? రణవీర్ కుళ్లుకున్నాడా?

డీప్ కిస్ దేనికి? రణవీర్ కుళ్లుకున్నాడా?

Sat Feb 12 2022 10:20:07 GMT+0530 (IST)

Why Deep Kiss? Did Ranveer rot?

రణవీర్ సింగ్ కుళ్లుకున్నాడా?  కోస్టార్ తో దీపిక హాటెస్ట్ లిప్ లాక్ లపై ప్రచారం హోరెత్తుతుంటే అతడు దానికి చెక్ పెట్టాలని అనుకుంటున్నాడా? అందుకేనా ఈ లేటెస్ట్ లిప్ లాక్ ఫోజ్? అసలేం జరుగుతోంది? అంటే కాస్త వివరాల్లోకి వెళ్లాలి.

గడిచిన కొంతకాలంగా గెహ్రయాన్ ప్రమోషన్స్ లో దీపిక పదుకొనే బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు విడుదల చేసిన గెహ్రయాన్ ట్రైలర్ లో దీపిక చెలరేగిపోయి కోస్టార్ సిద్ధాంత్ చతుర్వేదిని పెదవి ముద్దుల్లో ముంచెత్తిన వీడియో సంచలనమైంది. పెళ్లయినా దీపిక ఎందులోనూ తగ్గలేదు! అంటూ యూత్ లో వాడి వేడి చర్చా సాగుతోంది. అసలు రణవీర్ దీనికి ఎలా అంగీకరించారు? అంటూ కూడా చర్చించుకుంటున్నారు.
   
కానీ ఇంతలోనే ట్విస్టు..! ఇదే వేడిలో తన భార్యతో డీప్ లిప్ లాక్ వేసిన ఫోటోని రణవీర్ సోషల్ మీడియాల్లో షేర్ చేశాడు. రణవీర్ సింగ్ – దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న `డూబే` స్టిల్ ఇది. అతను ఆమెతో ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని షేర్ చేయగా ఇది కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.

దీపికా పదుకొణెతో రణవీరుని ప్రేమ రొమాన్స్ ఇంటెన్సిటీని ఇది ఆవిష్కరిస్తోంది. నిజానికి రణవీర్ ఏ వేదికపైనా ఇలాంటి ప్రేమను వ్యక్తీకరించే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. అతను తరచుగా భార్యపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ కనిపిస్తాడు. సతిని పదే పదే ప్రశంసిస్తూ పాటలు పాడుతూ కూడా కూడా కనిపించాడు. కాబట్టి దీపికా పదుకొణె ఇటీవల విడుదలైన గెహ్రాయాన్  పెదవి ముద్దుల సంచలనం కేవలం పబ్లిసిటీ స్టంట్ గానే భావించాలి. అయితే టైమ్ చూసి టైమ్ బాంబ్ లా అతడు నిరంతరం జరుగుతున్న గుసగుసలకు చెక్ పెట్టేందుకు ఇలా చేశాడని భావిస్తున్నారు.

శకున్ బాత్రా దర్శకత్వం వహించిన గెహ్రయాన్ కి రణవీర్ ప్రమోషన్స్ పరంగా తన వంతు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. గెహ్రైయాన్ లో దీపికా నటన గురించి రణ్ వీర్ రివ్యూ కోసమే వెయిటింగ్. ఇంతలోనే రణ్ వీర్ దీపికా పదుకొనేతో అన్ నోన్ ఫోటోని అభిమానులతో ఇన్ స్టాలో పంచుకున్నాడు.

ఈ జంట బీచ్ వెకేషన్ నుంచి ఫోటోగ్రాఫ్ ఇది. రిలీజైన వెంటనే ఇంటర్నెట్ లో అగ్గి రాజేసింది. ఇంతకుముందు ట్రైలర్ విడుదల కాగానే గెహ్రయాన్ పై రివ్యూని ఇచ్చాడు రణవీర్. ఇందులో దీపిక నటనను రణవీర్ సమీక్షించారు. ఆమె గురించి గర్వపడుతున్నట్లు పేర్కొన్నాడు. అతను ఇలా రాసాడు. “దూబే…హాన్ డూబే… ఏక్ దూజే మే యహాన్… టూర్ డి ఫోర్స్. అతీతమైనది.. అత్యున్నతమైనది.. ఉత్కృష్టమైనది! పనితీరు సంపూర్ణంగా మాస్టర్ క్లాస్.. బేబీ! ఇంత చక్కటి .. సూక్ష్మమైన హార్ట్ టచింగ్ కళాత్మకత! … ఇందులో మీ పూర్తి  సాటిలేని నటన కనబరిచారు. మీ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది! @దీపికపదుకొనే #గెహ్రైయాన్“ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ చిత్రంలో అనన్య పాండే- సిద్ధాంత్ చతుర్వేది- ధైర్య కర్వా కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రివ్యూలను అందుకుంటోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అనన్య పాండే- సిద్ధాంత్ చతుర్వేది- ధైర్య కర్వాతో దీపిక కు మొదటి చిత్రమిది. కొత్తవారితో తన కెమిస్ట్రీ గురించి చెబుతూ..ఏమన్నారంటే.. “ఇది ఖచ్చితంగా నాకు తెలిసిన కథతో తెరకెక్కింది.  ఏ సమయంలోనైనా… ఎవరినీ బెదిరించడానికి లేదా బెదిరించబడడానికి నేను ఇష్టపడను. నిజానికి మనమందరం ముందుగా గోవా వెళ్లి కాలక్షేపం చేద్దామని.. ఒకరినొకరు తెలుసుకోవాలని రాసుకున్న స్క్రిప్ట్ ను చదువుతూ ఉండాలని నేను దర్శకుడు శకున్ కి ఆలోచనను షేర్ చేశాను. ఎందుకంటే ఇది సంబంధాలపై సినిమా. చాలా వాస్తవమైన నిజాల్ని చూపిస్తూ సేంద్రీయంగా అనిపించే చిత్రం. నేను వారికి వీలైనంత సుఖంగా ఉండేలా చేశానని .. ముందస్తు ఆలోచనతో నా పాత్రకు ప్రిపేరయ్యాను. “ ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock