NEWS

పదేళ్ల వయసు చిన్నోడైన కుర్ర హీరోతో హీరోయిన్ రొమాన్స్ హాట్ టాపిక్

పదేళ్ల వయసు చిన్నోడైన కుర్ర హీరోతో హీరోయిన్ రొమాన్స్ హాట్ టాపిక్

Fri Feb 11 2022 17:00:01 GMT+0530 (IST)

Heroine romance hot topic with ten year old boy hero

బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మోస్ట్ క్రేజీ అవైటెడ్ మూవీ ‘గేహరైయాన్’. అమెజాన్ లో నేటి నుండి డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కు మంచి స్పందన వస్తోంది. దీపిక పదుకునే మరియు అనన్య పాండేలు హీరోయిన్స్ గా సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్ రిలీజ్ కు ప్లాన్ చేసినా అమెజాన్ నుండి వచ్చిన భారీ డీల్ కు నిర్మాతలు బెండ్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది.

కారణం ఏదో కాని సినిమాను డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు నుండే సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ సినిమా లో దీపిక పదుకునే మరియు సిద్దాంత్ లకు సంబంధించిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

దీపిక పదుకునే తనకంటే దాదాపుగా పదేళ్ల వయసు వ్యక్తి అయిన సిద్దాంత్ చతుర్వేది తో రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చి పోయింది. పెళ్లి తర్వాత దీపిక పదుకునే పలు సినిమాల్లో నటించింది. కాని దాదాపు అన్ని సినిమాల్లో కూడా కాస్త పద్దతిగానే కనిపించారు.

హాట్ గా కనిపించినా రొమాంటిక్ సన్నివేశాల విషయానికి వచ్చేప్పటికి ఆమె కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. పెళ్లికి ముందు కొన్ని సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినా పెళ్లి తర్వాత దీపిక పదుకునే ఆ సన్నివేశాల్లో నటించక పోవడంతో అభిమానులు ఆమె రొమాంటిక్ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గేహరైయాన్ సినిమా లో ఈ అమ్మడి రొమాంటిక్ సన్నివేశాలు చర్చనీయాంశంగా మారింది.

గత కొన్ని రోజులుగా గేహరైయాన్ లోని రొమాంటిక్ సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో పీక్స్ లో చర్చ జరుగుతోంది. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఏంటీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరి కొందరు ఈ రొమాంటిక్ సన్నివేశాలకు మీ భర్త రణ్వీర్ నుండి పర్మీషన్ తీసుకున్నారా అంటూ ఒక అభిమాని ప్రశ్నించడంతో దీపిక సీరియస్ అయిన విషయం తెల్సిందే. ఇంకా పలు విషయాలతో గేహరైయాన్ వివాదాలు రాజేసిన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి నెలకొంది. కనుక అమెజాన్ లో ఈ సినిమా పై విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాలో మరింతగా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు అత్యధికంగా ఈ సినిమాను చూసే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock