NEWS

ప్రతి కౌగిలింతకూ లెక్కుంది.. ఏ హగ్ ఎలాంటిదంటే?

ప్రతి కౌగిలింతకూ లెక్కుంది.. ఏ హగ్ ఎలాంటిదంటే?

Sun Feb 13 2022 10:23:03 GMT+0530 (IST)

Types Of Hugs

ప్రేమను.. అప్యాయతను.. మోజును.. ఆకర్షణను.. అనురాగాన్ని.. ఇలా ప్రతి భావోద్వేగాన్ని తెలియజేసేందుకు కౌగిలింతతో చెప్పేయొచ్చు. మనిషి మూడ్ ను ఇట్టే మార్చేసే శక్తి హగ్ సొంతం. బంధం ఏదైనా బిగి కౌగిలితో తాము చెప్పాలనుకున్న భావోద్వేగాన్ని చెప్పేసే వీలు ఉంటుంది. మాటలతో పని లేకుండా హగ్ తో చెప్పేసే ఈ తీరుకు సంబంధించి ఒక్కో హగ్.. ఒక్కో అర్థాన్ని చెబుతుందంటున్నారు నిపుణులు.

ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవటం తెలిసిందే. కానీ.. ఫిబ్రవరి 12ను హగ్ డేగా జరుపుకుంటారు. ఇంతకూ ఏ హగ్ ఎలాంటి అర్థాన్ని ఇస్తుందన్నది చూస్తే..

–  వెనుక నుంచి హత్తుకునే హగ్ కు అర్థం.. మీ రక్షణ గురించి వారెంతో కమిట్ మెంట్ తో ఉన్నట్లుగా చెబుతారు. సాధారణంగా వెనుక నుంచి కౌగిలింతలు.. ప్రేమికులు.. భార్యభర్తల మధ్య కనిపిస్తూ ఉంటాయి. మాటల్లో చెప్పలేని భావాన్ని వెనుక నుంచి గట్టిగా వచ్చి కౌగిలించుకున్నాడంటే.. వారికి మీపైన ఎంతో ప్రేమ.. నమ్మకం ఉన్నాయన్నది అర్థమట.

–  బేర్ హగ్ అంటే మరేదో కాదు.. బిగి కౌగిలి. ఇది ప్రేమికుల మధ్య.. తల్లిదండ్రుల మధ్య.. భార్యభర్తల మధ్య.. స్నేహితులు.. బంధువుల మధ్య ఉంటుంది. నిన్ను విడిచి నేను ఉండలేను.. నీకు దూరం కాలేనంటూ చెప్పేందుకు వీలుగా ఈ బిగి కౌగిలి ఉంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని బిగి కౌగిలి చేసుకుంటే.. వారికి మీపైన ఎంతో ప్రేమ ఉన్నట్లుగా అర్థం.

–  పొలైట్ హగ్ అంటే.. సాధారణంగా స్నేహితులు.. తల్లిదండ్రులతో వారి పిల్లల మధ్య ఈ తరహా కౌగిలింత కనిపిస్తూ ుంటుంది. ఇలా ఎవరైనా హగ్ చేసుకుంటే.. మీకు నేను ఉన్నానన్న భరోసాను కల్పించటమే దీని అర్థం. చిరునవ్వుతో ఆత్మీయంగా చేసుకునే ఈ హగ్ స్నేహపూర్వకంగా ఉంటుంది.

–  కళ్లల్లో కళ్లు పెట్టి కౌగిలించుకుంటే.. మీ కళ్లల్లోకి కళ్లు పెట్టి.. కౌగిలించుకుంటే.. సదరు వ్యక్తి మీ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు.. పిచ్చి ప్రేమకు నిదర్శనమే సదరు హగ్ గా చెప్పాలి. శరీరాలు పెనవేసుకుంటూనే.. కళ్లతో మాట్లాడుకుంటూ ఇచ్చుకునే ఈ హగ్.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న దగ్గరితనాన్ని చెప్పేస్తుంది.

–  ఇలాంటి హగ్ ను అనుమానించాల్సిందే… ఇప్పటివరకు చెప్పిన హగ్ లతో ఏదో ఆత్మీయత.. అంతకు మించిన అనురాగం.. ప్రేమ అప్యాయతలతో నిండి ఉన్నవే. ఇప్పుడు చెప్పే హగ్ మాత్రం కాస్త డేంజర్ కేస్ గా చెప్పాలి. నడుముపై చేతులు వేసి కౌగిలించుకునే వారితో జాగ్రత్తగా ఉండాలట. ఇలాంటి వారిని ప్రేమించాలా? వద్దా? అన్న డౌట్ ఉంటుందట. ఇలాంటి వారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంతే త్వరగా విడిపోవటం కూడా ఉంటుందని చెబుతున్నారు.

–  లండన్ బ్రిడ్జ్ హగ్ అంటే.. శరీరాలు పెనవేసుకోకుండా.. ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుంటూ లూజ్ గా చేసుకునే ఆలింగనంగా చెప్పొచ్చు. ఇలా కౌగిలించుకునే వారి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్పించి మరే బంధం ఉండదని చెబుతారు. దీన్నే లండన్ బ్రిడ్జ్ హగ్ గా చెబుతారు.

–  హగ్ వేళ వీపు నిమురుతుంటే.. హగ్ చేసుకున్న వేళలో వీపు నిమిరే అనుభవాన్ని చాలామందికి అనుభవమే. ఈ హగ్ కాస్త భిన్నమైనది. ఇలా హగ్ చేసుకున్నారంటే.. వారు మీ సంరక్షకులుగా చెప్పొచ్చు. ప్రోత్సహించేందుకు.. ఓదార్చేందుకు ఈ తరహా హగ్ లు ఇస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock