NEWS

ఫోటోటాక్ : కెమెరా ఉమెన్ అవుతావా అందాల అమ్మడు?

ఫోటోటాక్ : కెమెరా ఉమెన్ అవుతావా అందాల అమ్మడు?

Sun Feb 13 2022 10:42:32 GMT+0530 (IST)

Payal Rajput Latest Photo

ఆర్ ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బోల్డ్ బ్యూటీగా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. ఈ అమ్మడు ఆ తర్వాత కూడా తన అందంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్ లు మరియు ఐటెం సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈ అమ్మడు ఫొటోలను షేర్ చేస్తూ తన అందాలతో అందరిని వావ్ అనిపించేలా చేస్తుంది. కనుక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు తమిళ చిత్రం గోల్మాల్ షూటింగ్ లో పాల్గొంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తమిళ చిత్రం గోల్మాల్ రెండవ షెడ్యూల్ లో పాల్గొంటున్నాను అంటూ ఈ ఫొటోలను షేర్ చేసింది. సాదారణంగా ఎప్పుడు కూడా కెమెరా ముందు హాట్ అందాల ఆరబోత ఫొటో షూట్స్ ను ఇచ్చే ఈ అమ్మడు ఈ సారి మాత్రం ఏకంగా కెమెరాతో తన అందాల ఆరబోత చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది.

ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఫొటో కూడా ఈమె యొక్క ఫాలోవర్స్ కు ఖచ్చితంగా ఎంటర్ టైన్మెంట్ ను ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

పింక్ టీషర్ట్ వేసుకుని బ్లూ జీన్స్ ధరించి నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ పెద్ద కెమెరాతో ఫోజు ఇచ్చిన ఈ అమ్మడికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమిళంలో ఈ అమ్మడు రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది.

ఈ ఏడాది ఈమె నుండి తెలుగు మరియు తమిళం ఇతర భాషల సినిమాలు కలిపి మొత్తంగా ఆరు ఏడు ప్రాజెక్ట్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాల్లో కూడా ఈమె నటిస్తుంది. తన అందాలతోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకోగల సత్తా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరింతగా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు వెబ్ సిరీస్ కు కూడా ఈమె ఓకే చెప్పిందని.. త్వరలోనే మరో వెబ్ సిరీస్ కూడా పట్టాలెక్కబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock