NEWS

బన్నీ పాన్ వరల్డ్ కి రీచ్ అవ్వాలంటే హోమాలు చెయ్యాలా!

బన్నీ పాన్ వరల్డ్ కి రీచ్ అవ్వాలంటే హోమాలు చెయ్యాలా!

Fri Feb 11 2022 15:00:01 GMT+0530 (IST)

Do Homes To Reach The Bunny Pan World!

`పుష్ప ది రైజ్` సక్సెస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. జాతీయ స్థాయిలో బన్నీ పేరిప్పుడు ఓ రేంజ్ లో మారు మ్రోగుతోంది. సాక్షాత్తు ప్రధాని మోదీనే `పుష్ప` సక్సెస్ గురించి మాట్లాడారంటే `పుష్ప` రేంజ్ ఏంటో తేటతెల్లమవుతోంది.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ రాజకీయా ప్రసంగాలలో సైతం `పుష్ప` డైలాగులు అలవోకగా పలుకుతన్నారంటే `పుష్ప` ఇంపాక్ట్ కి మరో సంకేతం.  శ్రీవల్లి సిగ్నేచర్ స్పెప్పుతో విదేశీ క్రికెటర్లలోనూ బన్నీ క్రేజీ స్టార్ గా సంపాదించారు. బన్నీ ఖ్యాతి ఇప్పుడు  దేశం దాటి ఖండాలు విస్తరించింది. దీంతో `పుష్ప -2` కోసం వరల్డ్ వైడ్ అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో   ఎదురుచూస్తున్నారు.

 ఈ నేపథ్యంలో బన్నీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? అన్న దానిపై సన్నిహితులు..శ్రేయోభిలాషులు  అల్లు అర్జున్ జాతకాన్ని జ్యోతిష్యులతో పరిశీలిస్తున్నారుట. బన్నీ భవిష్యత్ లో ఇంకే స్థాయికి చేరుకుంటారు?  పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లో అతని సాధించబోబే సంచలనాలు ఎలా ఉంటయో ముందే అంచనా వేయాలని  ఇలా జ్యోతిష్యలు బాట పట్టినట్లు తెలుస్తోంది.

మరి బన్నీ జాతకం చూసిన జ్యోతిష్య పండితులు ఏమంటున్నారంటే? బన్నీ  జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని.. అతని కెరీర్ పీక్స్లో ఉంటుందని జ్యోతిష్యులు సైతం బల్ల గుద్ది మరీ చెబుతున్నారుట. అయితే అందుకు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించారుట.

జీవిత ప్రయాణంలో  ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా..సంతోషంగా సాగిపోవాలంటే కొన్ని హోమాలు..యజ్ఞయాగాలు చేస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని  జ్యోతిష్యలు సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి బన్నీ కూడా రెడీ  అవుతున్నారుట. కుటుంబ సమేతంగా ఫామ్ హౌస్ లో పూజలు నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారుట. `పుష్ప-2` మ్యూజిక్ సెషన్ కంటే ముందుగానే ఈ తంతు మొత్తం పూర్తిచేయాలని భావిస్తున్నారుట. ఇలాంటి పూజల ద్వారా బన్నీకి  దిష్టిదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అన్నది ఓ కారణంగా కొచ్చు.

జ్యోతిష్యులు ఇలా బన్నీ కెరీర్  గ్రాఫ్ గురించి విశ్లేస్తుంటే అవధాని ..పద్మ శ్రీ గ్రహీత గరికపాటి నరసింహారావు `పుష్ప` లో బన్నీ పాత్రపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.  విలన్ గా చూపించాల్సిన పాత్రని హీరోగా చూపించడంపై..అలాగే `తగ్గేదెలే` అన్న డైలాగ్ పై గరికపాటి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. దీనిపై కొందరు మండిపడ్డారు. సినిమాని సినిమాగానే చూడాలని గరికపాటి పై కౌంటర్లు వేసారు.  `పుష్ప` రెండవ భాగంలో సుకుమార్ వాటికి ఎలాంటి బధులిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock