NEWS

మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న సామ్ సెట్ లైఫ్ పిక్

మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న సామ్ సెట్ లైఫ్ పిక్

Fri Feb 11 2022 21:00:01 GMT+0530 (IST)

Samantha Latest Photo

నాగచైతన్యకు విడాకులు ప్రకటించిన తరువాత సమంత చాలా ఫ్రీ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. ముందు కొంత డిప్రెషన్ మూడ్ లోకి వెళ్లినా ఆ తరువాత రిషీకేష్ యాత్ర తరువాత రెట్టించిన ఉత్సాహంతో కనిపించి ఆశ్చర్యపరిచింది. అదే జోష్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వచ్చింది. ప్రస్తుతం సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ `యశోద`లో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉన్నిముకుందన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈమూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే సమంత సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సామ్ మోనోక్రోమ్ పిక్ నెటిజన్ లని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.

బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ లో వున్న ఈ ఫొటోలో సామ్ ముగ్ధమనోహర రూపం వెలిగిపోతోంది. `సెట్ లైఫ్` పేరుతో సమంత పంచుకున్న ఫొటోలో సామ్ మెరిసే కళ్లు.. సరళమైన ఆమె చిరునవ్వు వీక్షకుల హృదయాల్ని కొల్లగొడుతోంది. ఈ ఫొటో తో పాటు `మధ్యలో ఉన్న క్షణాలు` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులతో టచ్ లో వుండే సమంత ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తూ తన అభిమానుల్ని ఆకట్టుకుంటుండటం విశేషం.

నటిగా `ఏమాయ చేసావే` చిత్రం నుంచి నిన్నటి `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ వరుకు అద్భుత అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలతో పాటు విమర్శల్ని సొంతం చేసుకుంది. వ్యక్తి గత జీవితంలో పాటు వృత్తి పరంగానూ `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ తరువాత విమర్శల్ని ఎదుర్కొన్న సమంత ప్రతీ విషయాన్ని సోసల్ మీడియా వేదిగా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. డాబాపై వెజిటెబుల్స్ పండించడంతో పాటు తన పెంపుడు జంతువులైన హాష్ అండ్ సాషాతో సరదాగా గడిపిన సమయాలని డైలీ తను చేసే వర్కవుట్ లకు సంబంధించిన వీడియోలని కాకుండా హాట్ హాట్ ఫొటో షూట్ లకు సంబంధించిన ఫొటోలని కూడా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే సమంత నటించిన చారిత్రక చిత్రం `శాకుంతం` చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది. ఇక తమిళంలో విజయ్ సేతుపతి నయనతారతో కలిసి నటించిన `కాతువాకుల రెండు కాదల్` మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ టీజర్ ని ఈ శుక్రవారం విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock