NEWS

యంగ్ టైగర్ కు హ్యాండిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

యంగ్ టైగర్ కు హ్యాండిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

Fri Feb 11 2022 15:00:01 GMT+0530 (IST)

Bollywood heroine handing over to Young Tiger

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం అని ఏ ముహూర్తాన ఫిక్స్ చేశారో కానీ ఈ ప్రాజెక్ట్ కు అడుగడుగున అవాంతరాలే ఎదురవుతున్నాయి. ముందు ఈ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని ప్లాన్ చేశారు. క్లాప్ కొట్టలేదు.. ముహూర్తం జరగలేదు.. అనౌన్స్ మెంట్ అయ్యాక సినిమా చేతులు మారింది. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కొరటాల శివ చేతుల్లోకి వెళ్లింది. నెంబర్ సేమ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించి కూడా దాదాపు ఏడాది కావస్తోంది. అయితే ఈ మూవీ రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. మరో పక్క దర్శకుడు కొరటాల శివ కూడా `ఆచార్య` పనుల్లో బిజీగా వుండటం కూడా ఈ మూవీ పట్టలెక్కకపోవడానికి ప్రధాన సమస్యగా మారింది. ఇదిలా వుంటే.. `ఆర్ ఆర్ ఆర్` కారణంగా టాలీవుడ్ దేశ వ్యాప్తంగా పాపులర్ కాడంతో బాలీవుడ్ హీరోయిన్ లు టాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న అలియాభట్ తాజాగా ఎన్టీఆర్ 30 వ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అయితే తాజాగా ఆమె ఈ మూవీకి హ్యాండిచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కారణంగానే సినిమాకు బ్రేక్ పడిందని కూడా చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే… రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరటాల శివతో చేయనున్న చిత్రాన్ని ఎన్టీఆర్ ప్రారంభించడానికి రెడీ అయిపోయారు. ఇందులో భాగంగానే దర్శకుడు అలియాభట్ ని హీరోయిన్ గా నటించమని సంప్రదించడం తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి.  

అయితే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పట్టాలెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారట. కానీ అలియా మాత్రం తాను రాలేనని తను రావాలంటే రెండు వారాలు ఆగాల్సిందే అంటు షాకివ్వడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ – కొరటాల ప్రాజెక్ట్ ఓ పాన్ ఇండియా మూవీ. దీనికి  అలియా భట్ తోడైతేనే నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ అవుతుంది.

ఆ ప్లాన్ లో భాగంగానే కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ కోసం అలియా భట్ ని ఫైనల్ చేశారు. అయితే తాను అనుకున్న ప్రకారం ఫిబ్రవరి ఫిస్ట్ వీక్ లో మూవీని ప్రారంభించడానికి అలియాభట్ అడ్డుచెప్పడంతో ఈ సినిమా ప్రారంభానికి బిగ్ బ్రేక్ పడింది అంటున్నారు.

అలియాభట్ నటించిన బాలీవుడ్ చిత్రం `గంగూబాయి కతియావాడీ`. సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీపై అలియాభట్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డుని అలియా భట్ ఎక్స్పెక్ట్ చేస్తోందట. ఈ నెల 25నే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వున్న అలియా భట్… ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ కి రాలేనని ఖచ్చితంగా చెప్పేసిందట. అలియా సడన్ గా హ్యాండివ్వడంతో చేసేది లేక లాంఛింగ్ కోసం మరో డేట్ ని ఫిక్స్ చేసే పనిలో వున్నారట మేకర్స్.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock