NEWS

‘వర్జిన్ స్టోరీ’ ట్రైలర్ : నెంబర్స్ కాదనే టైమ్ వచ్చేసింది

‘వర్జిన్ స్టోరీ’ ట్రైలర్ : నెంబర్స్ కాదనే టైమ్ వచ్చేసింది

Sat Feb 12 2022 22:17:42 GMT+0530 (IST)

Virgin Story Trailer realeased

విభిన్నమైన చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నా లగడపాటి శ్రీధర్. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `వర్జీన్ స్టోరీ`. సౌమిక పాండియన్ రిషీ ఖన్నా వినీత్ బవిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ బి. అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలో విక్రమ్ సహిదేవ్ అన్వర్ అనే కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. కొంత విరామం తరువాత `వర్జీన్ స్టోరీ` మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. `కొత్తగా రెక్కలొచ్చెనా` అనేది క్యాప్షన్. ఫ్రెష్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ ని టార్గెట్ చేసి రూపొందించినట్టుగా తెలుస్తోంది.

`నువ్వు ఒకేసారి ఇద్దర్ని లవ్ చేస్తున్నావని అనుకుంటే ఆ రెండో పర్సన్ నే ఎంచుకో ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ని నిజంగా లవ్ చేసి వుంటే ఆ రెండో పర్సన్ ఉండే ఛాన్సే లేదు` అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పబ్ లో హీరోని చూసి నాయిక ఇంప్రెస్ అవడం.. ఆ తర్వాత వాళ్ల లవ్ జర్నీ మొదలవ్వడం.. చిన్న చిన్న అపార్థాలతో విడిపోవడం.. ఆ ఎడబాటుని విరహ వేదనగా చూపించిన తీరు.. ఇదే క్రమంలో హీరోయిన్ ఫ్రెండ్ `మనల్ని అబ్బాయిలు నెంబర్స్ లా చూస్తారు కానీ మనం నెంబర్స్ కాదని చెప్పే టైమ్ వచ్చింది` అంటూ చెప్పడం ఆకట్టుకుంటోంది.

సినిమా ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడిన యువత ఎలా పెడదోవ పడుతున్నారో ఈ ట్రైలర్ లో చూపించారు. అపరిపక్వమైన ప్రేమలు బంధాలని చూపిస్తూ ప్రేమ పేరుతో నేటి యువత పక్కదారి పడుతున్న తీరుని ఆవిష్కరించారు. రొమాంటిక్ అంశాలతో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సినిమా వుంటుందని తెలుస్తోంది. విక్రమ్ సహదేవ్ కి మంచి గుర్తింపుని అందించేలా ఈ మూవీ వుండబోతోందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock