NEWS

100మందిని పిలిచి జగపతి బాబు సంచలన నిర్ణయం

100మందిని పిలిచి జగపతి బాబు సంచలన నిర్ణయం

Sat Feb 12 2022 07:00:01 GMT+0530 (IST)

Jagapathi Babu pledges organs on his 60th birthday

ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) హాస్పిటల్స్ లో జరిగిన ఓ సమావేశంలో తన అవయవాలను దానమిస్తున్నానని ప్రకటించారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే తన కీలక అవయవాలను దానం చేస్తానన్న ప్రతిజ్ఞపై జగపతి సంతకం చేశాడు. అతను తన 100 మంది స్నేహితులు అభిమానులను మానవత్వం అనే కోణంలో సేవ కోసం అవయవాలను దానమివ్వాలని.. ప్రతిజ్ఞ చేయమని ప్రోత్సహించాడు.

ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మనిషి బతుక్కి ఒక అర్థం ఉండాలి. మనం భాగమైన ఈ సమాజానికి మనమే ఏదైనా తిరిగి ఇవ్వగలిగితే మన జీవితానికి సరైన అర్థం ఉంటుంది. ఇతరులకు చూడటానికి.. ఊపిరి పోయడానికి.. బ్రతకనివ్వడానికి సహాయం చేయడంలో మంచి ఉందని నేను నమ్ముతున్నాను. మనమంతా మరణానంతరం చేయాల్సినవి కచ్చితంగా ఆలోచించాల్సిన గొప్ప విషయం“అని ప్రతిజ్ఞపై సంతకం చేసే కార్యక్రమంలో ఆయన అన్నారు.

నా స్నేహితులందరూ నటుడిగా నా పనిని ఇష్టపడే వారు.. అభినందిస్తున్న వారందరూ తమ జీవితాలను అంధకారంలో చిక్కుకున్న లక్షలాది మందికి సహాయం చేయడానికి వారి అవయవాలను దానమిస్తున్నామని ప్రతిజ్ఞ చేయాలని నేను కోరుతున్నాను అని అన్నారు.

కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు మాట్లాడుతూ.. జగపతిబాబు తన నటజీవితంలో ఎన్నో పాత్రలు పోషించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని నేడు తన అవయవాలను దానమిచ్చి సమాజంలోని కోట్లాది మందికి నిజమైన హీరోగా స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. అతని నిర్ణయం నేటి చర్య తన అభిమానులను ప్రోత్సహిస్తుంది.

అందరిలో అవయవ దానం గురించి అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని జగపతిబాబు ఆశిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్- ఇంచార్జి డాక్టర్ జి.స్వర్ణలత- జీవందన్ తదిరులు విచ్చేశారు. జగపతిబాబు స్నేహితులు అభిమానులు హాజరయ్యారు.

ప్రతి సంవత్సరం చాలా మంది తమ అవయవాలను దానమిస్తామని ప్రతిజ్ఞ చేస్తారని చనిపోయిన వ్యక్తుల నుండి అవయవాలను స్వీకరించి డాక్టర్లు వందలాది మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇంకా భారతదేశం పరిమాణంలో ఉన్న దేశంలో విఫలమైన అవయవం కారణంగా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా చూసుకోవడానికి ప్రతి పౌరుడు ముందుకు వచ్చి వారి అవయవాలను దానమిస్తానని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది.

 కేంద్రం రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించడానికి మరణానంతరం వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు సాగేలా ప్రోత్సహించడానికి సాధ్యమైన ప్రతి ప్రచారాన్ని విధిగా చేస్తున్నాయి. ఇక అవయవ దానంపై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు హీరోలు ప్రచారం చేస్తున్నారు. పలు ట్రస్టులు కూడా దీనిపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock