NEWS

USలో DJ టిల్లు హవా.. ఒక్క రోజులో బ్రేక్ ఈవెన్

USలో DJ టిల్లు హవా.. ఒక్క రోజులో బ్రేక్ ఈవెన్

Sun Feb 13 2022 09:34:41 GMT+0530 (IST)

DJ Tillu Achieved Breakeven In USA On Day One Itself

కొంతకాలంగా డీజే టిల్లు ప్రచార హంగామా తెలిసిందే. సినిమాలో కడుపుబ్బా నవ్వించే కంటెంట్ ఉందని ప్రచారంతోనే ఒక క్లారిటీ వచ్చింది. నిర్మాత నాగవంశీ ప్రచారపు ఎత్తుగడ ఫలించింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజై తొలిరోజు బంపర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద హీటెక్కించింది. ఇంటా బయటా ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోందని టీమ్ ప్రకటించింది.

సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను రూ.70 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఈ చిత్రం అమెరికాలో ప్రీమియర్ల నుండి దాదాపు 100 కె డాలర్లు.. మొదటి రోజు మరో 100కె డాలర్లు వసూలు చేసింది. 200 కె డాలర్లను ప్రీమియర్ తో కలుపుకుని డే 1లో సాధించడం అరుదైన ఫీట్.

ఈ సినిమా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ ని లాభాల బాటలోకి తెచ్చిందని రిపోర్ట్ అందింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద స్క్రీన్లు పెంచే ఆస్కారం ఉందని సమాచారం. ఇక లోకల్ మార్కెట్ లోనూ టిల్లు హవా కొనసాగుతోంది.

మూడో వేవ్ తర్వాత పుష్ప బంపర్ హిట్ కొట్టంది. ఇప్పుడు డీజే టిల్లు ఫలితం సంతృప్తికరం అన్న టాక్ వినిపిస్తోంది. మరో రెండు నెలల్లో భారీ చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విజయం పరిశ్రమకు పెద్ద ఊపునిస్తుందనడంలో సందేహం లేదు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

#DJ టిల్లు పేరు.. వీని స్టైలే వేరు ..1వ రోజు నైజాం షేర్ – 1.63 కోట్లు ..
మొదటి రోజు బ్రేక్ ఈవెన్.. రికార్డ్ బ్రేక్ బస్టర్ అంటూ నిర్మాతలు ప్రకటించారు.  సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఫార్చూన్ సినిమాస్ – ప్రైమ్ షో ఫిలింస్ ఈ చిత్రాన్ని విడుదల చేశాయి.

సిద్ధు షోపై ప్రశంసలే ప్రశంసలు

డీజే టిల్లుకి పాజిటివ్ సమీక్షలు ప్రధాన బలం. సిద్ధుకి మైలేజ్ పెంచే చిత్రమిదన్న టాక్ కూడా వినిపిస్తోంది. తల్లిదండ్రులు పెట్టిన బాలగంగాధర్ తిలక్ అనే పేరును టిల్లుగా మార్చుకుని చిన్న చిన్న ఫంక్షన్లలో డీజే కొడుతూ.. బయటికి పెద్ద బిల్డప్ ఇస్తూ తన స్టయిల్లో జీబితాన్ని సాగిస్తుండే డీజే టిల్లు కథ ఇది. సాఫీగా సాగిపోతున్న అతడి జీవితంలోకి అనుకోకుండా రాధిక (నేహా శెట్టి) వచ్చాక ఏం జరిగిందో తెరపైనే చూడాలి.

ఇందులో ముఖ్యంగా సిద్ధు నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా అడుగులేస్తున్నాడు. కృష్ణ అండ్ హిజ్ లీల లో అతడికి కనెక్టయిన వాళ్లకు ఈ సినిమాతో అతను మరింతగా నచ్చేస్తాడు. టిల్లు పాత్రతో అతను కొత్త అభిమానులను కూడా సంపాదంచుకుంటాడు.

నటనలో.. డైలాగ్ డెలివరీలో అతడికో టిపికల్ స్టైల్ ఉంది. అది యువతకు బాగా నచ్చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ అర్బన్ యూత్ ఈ సినిమాతో మరింతగా కనెక్టవుతారు. హీరోయిన్ నేహా శర్మ.. ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోలిస్తే అన్ని రకాలుగా మెరుగ్గానే కనిపించింది. కానీ ఆరంభంలో ప్రత్యేకంగా కనిపించే ఈ పాత్ర తర్వాత మామూలుగా మారిపోతుంది. మూవీలో బ్రహ్మాజీ కనిపించిన కాసేపూ బాగానే ఎంటర్టైన్ చేశాడు. ప్రిన్స్ ఓకే అనిపిస్తాడు. హీరో తండ్రిగా చేసిన నటుడు బాగా నటించాడు.. అంటూ సమీక్షకులు ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock